Header Banner

శ్రీవారి ఆలయంలో చోరీ కలకలం! టీటీడీ సీనియర్ ఉద్యోగి చేతివాటం వెలుగులోకి!

  Tue Mar 11, 2025 13:45        Devotional

వేంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో కొంతమంది భక్తులు టీటీడీకి సంబంధించిన ట్రస్టులకు విరాళాలు భారీగా ఇస్తుంటారు. మరి కొందరు భక్తులు స్వామివారి హుండీల ద్వారా కానుకలను అందజేస్తారు. భక్తులు ఇస్తున్న కానుకలను టీటీడీలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో టీటీడీకి చెడ్డపేరు వస్తోంది. అయితే తాజాగా చెన్నైలో టీటీడీ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. టీటీడీకి చెందిన ఆలయ పరకామణిలో జరిగిన చోరీ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఏకంగా శ్రీవారి హుండీలోనే దొంగతనానికి సదరు ఉద్యోగి పాల్పడ్డాడు. శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ సీనియర్ ఉద్యోగి కృష్ణకుమార్‌ చేతివాటం చూపించాడు. విదేశీ కరెన్సీ రూపంలో స్వామివారికి భక్తులు కానుకలు అందజేశారు.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?


ఇందులో సదరు ఉద్యోగి భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ కరెన్సీ లెక్కపెడుతుండగా భారీగా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. కరెన్సీ లెక్కింపులో భారీగా తేడాలు ఉన్నట్లు ఆలయ అధికారులు గుర్తించారు. ఈ ఘటన బయటకు రావడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనానికి సంబంధించి టీటీడీ ఈవో శ్యామలరావుకు కమిటీ నివేదిక సమర్పించింది. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు కృష్ణకుమార్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టీటీడీ ఈవో శ్యామలరావు జారీ చేశారు. ఇటీవల శ్రీవారి దర్శన బ్లాక్‌ టికెట్ల దందా గుట్టురట్టయిన విషయం తెలిసిందే. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బ్లాక్‌లో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. టీటీడీ ఆస్తులను భద్రంగా ఉంచాలని శ్రీవారి భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ttd #thirupathi #devasthanam #chori #todaynews #flashnews #latestnews